ఇండియన్ 2 లో ఛాన్స్ కొట్టేసిన వెన్నెల కిషోర్

టాలీవుడ్ పాపులర్ కమెడియన్ వెన్నెల కిషోర్..లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 నటించే ఛాన్స్ కొట్టేసాడు. కమల్ హాసన్ – శంకర్ కలయికలో 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా..గతంలో సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం ,..ప్రాణ , ఆస్థి నష్టం జరగడం తో సినిమాకు బ్రేక్ పడింది.

ఈ మధ్యనే షూటింగ్ రీ స్టార్ట్ అయ్యి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్ధ్ ప్రియా భవానీ శంకర్ సముద్రఖని బాబీ సింహా వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అక్కడ కమల్ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా శంకర్ కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇది లాంగ్ షెడ్యూల్ అని అంటున్నారు. ఇక మూవీ లో వెన్నెల కిషోర్ ది కీలక పాత్ర అని సమాచారం.