అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘మీటర్’ సాంగ్ రిలీజ్

మీటర్ నుండి ‘ ఓ బేబీ జారిపోమాకే’ అంటూ సాగే సాంగ్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

ఇప్పటికే సినిమా తాలూకా ప్రమోషన్స్ ను భారీగా జరుపుతుండగా..తాజాగా సినిమాలోని ‘ ఓ బేబీ జారిపోమాకే’ అంటూ సాగే సాంగ్ ను ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకి బాలాజీ సాహిత్యాన్ని అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. ఈ సినిమాతో కథానాయికగా అతుల్య రవి పరిచయమవుతోంది.

YouTube video