ప్ర‌శ్నిస్తే నిషేధం విధిస్తారా..? – కేసీఆర్

ప్రభుత్వ తప్పులు బయటపెడితే నిషేధం విధిస్తారా..? అని ప్రశ్నించారు మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన పోరుబాట పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా అయన యాత్ర చేస్తుండగా..ప్రజల బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఫై , ప్రభుత్వం ఫై అనుచిత వ్యాఖ్యలు చేసారని చెప్పి అయన ఫై ఈసీకి పిర్యాదు చేయడంతో ఈసీ 48 గంటలపాటు ఎలాంటి ప్రచారం చేయకూడదని ఆదేశించింది. ఆదేశాల మేరకు 48 గంటల పాటు సైలెంట్ గా ఉన్న కేసీఆర్..నిన్న సాయంత్రం తో తన ఫై వేసిన నిషేధం తొలిగిపోవడం తో మళ్లీ యాత్ర మొదలుపెట్టారు.

పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రామ‌గుండంలో శుక్రవారం నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ..తాను చేపట్టిన బ‌స్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ను, తనను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్యయ్యాయని.. అందులో భాగంగానే తన ప్ర‌చారంపై నిషేధం విధించారని కేసీఆర్ పేర్కొన్నారు. 48 గంట‌ల నిషేధం పూర్తయిన త‌ర్వాత తన గొంతు ప్రజలకు వినిపిస్తున్నా అన్నారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. కానీ అమిత్ షా చేతిలో దేవుడి బొమ్మ పెట్టుకుని మాట్లాడుతుంటే.. ఈసీకి అది కనిపించడం లేదు. హిందువులు ముస్లింలు అని ప్రధాని మోదీ చెబితే ఈసీ వినిపించ‌డంలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే గుడ్లు పీకి గోలీలు ఆడుతాం, పండ‌వెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అని మాట్లాడితే ఈసీకి క‌న‌బ‌డ‌దు. చేనేత కార్మికుల పక్షాన మాట్లాడుతే ఈ తరహా నిషేధం విధించారు. రెండు గంటల ముందే ఇక్కడికి వచ్చిన, కానీ బ్యాన్ ఉంది కాబట్టి రా.8.15 తర్వాత బయటికి వచ్చిన అంటూ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, బీజేపీకి 200 సీట్ల కన్నా ఎక్కువ రావని వార్తలు వస్తున్నాయని.. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిస్తే కీలక పాత్ర పోషిస్తది అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలుపే ప్రజల గెలుపు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. మోసకారి కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.