తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ చెందిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి కరోనా

LB Nagar MLA Sudheer Reddy

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇకపోతే రాష్ర్టంలో కరోనా కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కు చేరగా.. ప్రస్తుతం 21, 417 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/