హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..

హైదరాబాద్ లో TSRTC కి చెందిన ఎలక్ట్రిక్ బస్సు లో మంటలు చెలరేగాయి. శుక్రవారం శంషాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకున్న విషయం ప్రయాణికులకు చెప్పడంతో వారంతా క్షేమంగా కిందకు దిగిపోయారు.

ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన తో కాసేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక TSRTC నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను నడిపేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.