తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష తేదీల ప్రకటన

Telangana Police
Telangana Police

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలను ప్రకటించారు.రెండు దఫాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 7 మరియు 21 తేదీలలో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 7న ఎస్ఐ రాత పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ రాత పరీక్షల హాల్ టికెట్లను https://www.tslprb.in/ వెబ్ ద్వారా పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆగస్ట్‌ 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) సోమవారం వెల్లడించింది. ఆగస్ట్‌ 21వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కానిస్టేబుల్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 30వ తేదీ నుంచి ఎస్‌ఐ, ఆగస్టు 10వ తేదీ నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులు హాట్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా, ఈ పరీక్షలకు సుమారు 8.95 లక్షల మంది హాజరుకానున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 80,039 పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఏప్రిల్‌ 28న నోటిఫికేషన్లను సైతం జారీ చేసింది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 17,291 పోస్టుల్ని భర్తీ చేయనున్నది. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులు, 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే బోర్డు దరఖాస్తులను సైతం స్వీకరించిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ పోస్టులకు 2.45లక్షల మంది అభ్యర్థులు, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్‌ఐ పోర్టులకు హైదరాబాద్‌ సహా 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు, కానిస్టేబుల్‌ పోస్టులకు హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.