‘గుడ్‌ లక్‌ సఖి’ టీజర్‌

త్రిభాషా చిత్రంగా ఏకకాలంలో నిర్మాణం

keethi suresh ‘Good Luck Sakhi’ teaser pic

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ‘గుడ్‌లక్‌ సఖి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఈసినిమా టీజర్‌ను యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశారు..

తమిళ వెర్షన్‌ టీజర్‌ను స్టార్‌ యాక్టర్‌ విజ§్‌ు సేతుపతి, మలయాళం వెర్షన్‌ టీజర్‌ను అక్కడి స్టార్‌ యాక్టర్‌ పృధ్వీరాజ్‌ సుకుమారన్‌రిలీజ్‌ చేశారు..

https://www.youtube.com/watch?v=3XncXRAVfLA
Teaser

టీజర్‌ చాలా ఆహ్లాదకరంగా , వినోదాత్మకంగా కన్పిస్తోంది..

అన్నివర్గాల ప్రేక్షకులను, ప్రధానంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈచిత్రం రూపొందుతోందనే విషయంఈ టీజర్‌ను చూస్తే అర్ధమవుతోంది..

హాస్యం పండించే పలుసన్నివేశాలు,చూడముచ్చటగా ఉన్న కీర్తిసురేష్‌ , ఆది పినిశెట్టి జోడీ.

వరడర్‌ఫుల్‌ మ్యూజిక్‌, మంచి డ్రామా, కృషితో ఏస్థాయికైనా ఎదగవచ్చనే అంశం, మన రాతను మనమే మార్చుకోవాలనే సందేశంతో టీజర్‌ ఇంప్రెసివ్‌గా కన్పిస్తోంది..

జాతీయ ఖ్యాతి పొందిన నరేష్‌కుమార్‌ డైరెక్టు చేస్తున్న గుడ్‌లక్‌ సఖి, తెలుగు, తమిళ, మలయాళంలో త్రిభాషా చిత్రంగా ఏకకాలంలో నిర్మాణమవుతోంది.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్న ఈమూవీని వర్త్‌ ఎ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మనిర్మిస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/