తెలంగాణ లో మాస్క్ లేకపోతే కేసే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి పెరుగుతుంది. పదులు , వందలు దాటి ప్రతి రోజు వేలసంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో సర్కార్ కరోనా ఆంక్షలను కఠినతరం చేసింది. ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికీ వెయ్యి ఫైన్ వేస్తూ వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ 10 రోజుల్లో గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 34 వేల కేసులు నమోదు చేశారు పోలీసులు.

హైదరాబాద్‌ పరిధిలో 19వేల650, సైబరాబాద్ పరిధిలో 12వేల785, రాచకొండ పరిధిలో 18వందల 41 కేసులు నమోదు చేశారు. మాస్కులేకుండా వెళ్తున్న వారిపై ఒక్కొక్కరికి వెయ్యి జరిమానా విధిస్తు..వారి ఫొటోలు తీసి ఇంటికి ఈ-చలానాలను పంపిస్తున్నారు. కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సీసీ కెమెరాలు… మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారిని ఫొటోలు తీస్తున్నాయి. మాస్క్‌ సరిగా ధరించనివారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అమర్చారు. ఈ కెమెరాలు మాస్క్‌ లేనివారిని గుర్తించి ఫొటోలు తీసి క్షణాల వ్యవధిలో ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంకు పంపిస్తున్నాయి. దీంతో సిటీ లో ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుంటూ బయటకు వస్తున్నారు. ఇక తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో 1,825 కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే ఆదివారం తో పోలిస్తే.. 152 క‌రోనా కేసులు పెరిగాయి.