టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ ర‌మ‌ణ‌

మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ స‌భ్య‌త్వం తీసుకున్న ఎల్‌.ర‌మ‌ణ‌

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ మాజీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ గులాబీ గూటికి చేరారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో ఎల్ ర‌మ‌ణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి కేటీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ‌.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

ఎల్‌.ర‌మ‌ణ‌తో పాటు ప‌లు సంఘాల నేత‌లు, ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మార‌డంపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవ‌ల‌ ర‌మ‌ణ చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/