తెలంగాణలో ఇప్పటివరకు 33 కరోనా పాజిటివ్ కేసులు
కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందదని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఖకరోనాగ పాజిటివ్ కేసుల సంఖ్య 33 కు చేరినట్లు వెల్లడించారు. ఖకరోనాగ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రైవేట్ వైద్య కళాశాలలో 15,040 పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/