వ్యక్తిగత సిబ్బందికి 3 నెలల జీతం చెల్లింపు

అవసరం ఉన్న వారికి సాయం చేయండి..

prakash raj
prakash raj

హైదరాబాద్‌: దేశంలో కరోనా విస్తుృతిని అరికట్టాలని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయంతో సగటు శ్రమ జీవులపై తీవ్ర ప్రభావం పడనుంది. దీనివల్ల రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారయింది. పనిలేక పూట గడవలేని వారి పరిస్థితి మాటలకందనిది. ఇలాంటి వారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సూచించారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి అలాగే తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చినట్టు తెలిపారు. తాను ఇంతటితో ఆగిపోనని, సాధ్యమయినంత మేరకు సాయం చేస్తానని, స్థోమత ఉన్న వారు అవసరం ఉన్న వారికి సాయం చేయాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/