సామాజిక సేవచేయాలని నల్గొండ కలెక్టర్ కు హై కోర్టు ఆదేశం

అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలని తీర్పు ‌

TS High Court orders -Nalgonda Collector to do social service
Telangana High court

Hyderabad: కోర్టు ధిక్కార‌ణ కేసులో న‌ల్గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కు ఆశ్రమంలో సేవ చేయాలని ‌ తెలంగాణ హైకోర్టు వినూత్న ఆదేశించింది…గ‌తంలో కోర్టు ఆదేశాల‌ను పాటించ‌క‌పోవ‌డంతో ఈ కేసును విచారించిన సింగిల్ జ‌డ్జి క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ , అప్ప‌టి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారిణి సంద్యారాణిల‌కు రూ. 2 వేలు ‌ జ‌రిమానా క‌ట్టాల‌ని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును ర‌ద్దు చేయాల‌ని వారిద్ద‌రూ డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించారు..

ఈ కేసును విచారించిన డివిజ‌న్ బెంచ్ అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలని కలెక్టర్‌‌ను ఆదేశించింది. 6 నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని కలెక్టర్‌కు ఆదేశించింది. ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణి భోజనాలు పెట్టాలని ఆదేశించింది. కోర్టు ధిక్కార‌ణ నిరూప‌ణ కావ‌డంతో ఈ ఇద్ద‌రు సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను ముగించింది.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/