వడ్డీ రేట్లు యధాతథం: ఆర్బీఐ కీలక నిర్ణయం

పరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించిన శక్తికాంత దాస్‌

RBI decision-Interest rates unchanged
RBI Governor Shaktikanta Das

Mumbai: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటు యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాగా కమిటీ నిర్ణయాలను తాజాగా అయన వెల్లడించారు

రెపో రేటు 4 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతాయ‌ని, ఈ మేర‌కు రేట్లను యథాతథంగా ఉంచేందుకు కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వివరించారు.

ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి ,, కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ ల‌క్ష్యాన్ని సాధించడం కోస‌మే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/