ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ భారీ రేటుకు జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.125 కోట్లకు జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా నైజం హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను రూ.42 కోట్ల భారీ రేటుకు దక్కించుకున్నారు. ఇక సీడెడ్, ఆంధ్ర హక్కులు రూ.60 కోట్లు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా చిరు కెరీర్‌లో ఈ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకున్న సినిమాగా ఆచార్య నిలిచిందని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో చిరంజీవి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపించనుండగా, ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో కేమియో రోల్ చేస్తున్నాడు. అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఆచార్య చిత్రాన్ని మే 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.