గుంటూరు జిల్లాలో కరోనా చికిత్సకు 53 వైద్యశాలలు సిద్ధం

కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ప్రకటన

53 hospitals are ready for corona treatment -Guntur District Collector Vivek Yadav
53 hospitals are ready for corona treatment -Guntur District Collector Vivek Yadav

Guntur: జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటుకు సంబంధించి 53 ఆసుపత్రులను సిద్ధం చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 ఆరోగ్య శ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు, 21 నాన్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో కోవిడ్‌ –19 చికిత్స అందించేందుకు అనుమతులు మంజూరు చేశామన్నారు. వీటితో పాటు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి, ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి, తెనాలిలోని జిల్లా ఆసుపత్రి, నర్సరావుపేటలోని ఏరియా ఆసుపత్రి, మంగళగిరిలోని ఎయిమ్స్, ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాల ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రి, చౌడవరంలోని కాటూరి మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారన్నారు.

ప్రస్తుతం అనుమతులు మంజూరు చేసిన, అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులతో కలిపి 6000 బెడ్లు ఉన్నాయన్నారు. అనుమతి మంజూరు చేసిన ఆసుపత్రులలో ఐసీయు బెడ్లు 526, నాన్‌ ఐసీయు బెడ్లు ఆక్సిజన్‌తో ఉన్నవి 2500, నాన్‌ ఐసీయు బెడ్లు ఆక్సిజన్‌ లేనివి 2000, వెంటీలేటర్లు 232 అందుబాటులో ఉన్నాయని మొత్తం బెడ్లు 5026 ఉన్నాయన్నారు. కోవిడ్‌–19 ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైరస్‌ సోకిన వారికి
ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా, సీఎంఆర్‌ఎఫ్‌ లెటరు ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందించాలన్నారు. కరోనా వైద్యసేవల కోసం
వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవో నెం 77, 78 ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని, వైద్యసేవల రుసుంలను ఆసుపత్రులలో తప్పనిసరిగా
ప్రదర్శించాలన్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా చికిత్సకు 53 వైద్యశాలలు సిద్ధం
గుంటూరు జిల్లాలో కరోనా చికిత్సకు 53 వైద్యశాలలు సిద్ధం

నిబంధనల ప్రకారం వైద్యసేవలు అందించని ఆసుపత్రులపై కోవిడ్‌ కాల్‌ సెంటరు 104 లేదా స్పందన కాల్‌
సెంటర్‌ 1902 కి ఫోన్‌ చేసి తెలిపితే వెంటనే చర్యలు తీసుకొని సరిౖయెన వైద్యసేవలు అందించటం జరుగుతుందన్నారు. కోవిడ్‌–19
ప్రైవేటు ఆసుపత్రులలో అందిస్తున్న చికిత్స పై నోడల్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని, ఆసుపత్రులలో ఉన్న
బెడ్ల ఆక్యుపెన్సీనీ, ఖాళీల వివరాలను పరిశీలించి చికిత్స అవసరమైన వారిని వెంటనే ఆసుపత్రులలో చేర్పించటం
జరుగుతుందన్నారు. కోవిడ్‌ రోగులు చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ, నాన్‌ ఆరోగ్య శ్రీ ఆసుపత్రులలో బెడ్‌ల సంఖ్య,
ఆక్యుపెన్సీ వివరాలతో పాటు ట్రీట్‌మెంట్‌ రేట్‌ కార్డు వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉందన్నారు. అలా వివరాలు
ప్రదర్శించని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ పేర్కోన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/