బకెట్‌లో పడి రెండేళ్ల చిన్నారి మృతి

2 years old boy died in sangareddy
2 years old boy died in sangareddy

సంగారెడ్డి: తెలంగాణ… సంగారెడ్డి జిల్లా… కల్హేర్ మండలం… బీబీపేట్‌లో జరిగిందో విషాదం. స్థానికంగా నివసిస్తున్న కవిత, నర్సింలకు ఏకైక కొడుకు రెండేళ్ల సాకేత్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ పక్కనే బకెట్ ఉంది. ఆటలాడుకుంటూ అప్పుడప్పుడు బకెట్ వైపు చూస్తున్నాడు. నాన్నా జాగ్రత్త… బయటకు వెళ్లకు అని చెప్పి… ఇంట్లో వాళ్లు తమ పనుల్లో మునిగిపోయారు.

ఈ చిన్నారి ఎందుకో ఆ బకెట్ నచ్చింది. దాని దగ్గరకు వెళ్లాడు. అందులో నీళ్లు సగానికి పైగా ఉన్నాయి. నీటిలో చూశాడు. అందులో తన ప్రతిబింబం కనిపించింది. దాన్ని ముట్టుకుందామని నీటిలోకి రెండు చేతులూ పెట్టాడు. అదే సమయంలో అదుపు తప్పి… బకెట్‌లో తలకిందులుగా పడిపోయాడు. సగానికి పైగా ఉన్న నీరు… పిల్లాడు పడటంతో… పూర్తిగా బకెట్ నిండింది. చేతులు కూడా బకెట్‌లో ఉండిపోయి… చిన్నారికి ఏం చెయ్యాలో, ఎలా బయటకు రావాలో అర్థం కాలేదు. పైన ఉన్న కాళ్లను అటూ ఇటూ ఊపసాగాడు. ఆ సమయంలో చుట్టూ ఎవరూ లేరు.

కాసేపటి తర్వాత చిన్నా ఏడి అంటూ దగ్గరకు వెళ్లి చూస్తే… బకెట్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయ్యో ఇదేంటి బకెట్‌లో పడ్డాడు… అనుకుంటూ… చిన్నారిని బయటకు తీశారు కుటుంబ సభ్యులు. ఉలుకూ పలుకూ లేదు. నాన్నా… బుజ్జీ… అయ్యో అంటూ ఎంత కదిపినా కదల్లేదు. వెంటనే కామారెడ్డి జిల్లా పిట్లం ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చిన్నారిని చెక్ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో తల్లిదండ్రుల కళ్ల వెంట నీరు ధారల్లా వచ్చేశాయి. ఒక్కగానొక్క చిన్నారి… కళ్ల ముందే చనిపోవడంతో… వాళ్లను ఓదార్చడం ఎవ్వరి వల్లా కాలేదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/