రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్ఎస్‌కు హైకోర్టు నోటీసులు

కోకాపేటలో బిఆర్ఎస్‌కు 11 ఎకరాల భూమి కేటాయింపు

High Court of Talangana
High Court of Talangana

హైదరాబాద్‌: హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్ఎస్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఎకరం రూ.50 కోట్లు పలుకుతున్న భూమిని కేవలం రూ.3.41 కోట్లకే బీఆర్ఎస్ కు కేటాయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా భూకేటాయింపుకు సంబంధించిన పత్రాలన్నింటినీ రహస్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఆగస్ట్ 16వ తేదీకి వాయిదా వేసింది.