షర్ట్ లేకుండా బీచ్‌లో హాలీవుడ్ హీరోలా జోబైడెన్

ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక జర్నలిస్ట్

baseball-cap-and-aviators-joe-biden-goes-shirtless-on-us-beach

వాషింగ్టన్‌ః అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజా ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా ఆయన దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బేస్ బాల్ క్యాప్, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఆయన కనిపిస్తున్నారు. డెలావేర్ లోని రెహోబోత్ వద్ద ఉన్న బీచ్ లో ఆయన సరదాగా కాసేపు సమయాన్ని గడిపారు. ఈ ఫొటోను అక్కడే ఉన్న ఒక జర్నలిస్ట్ క్యాప్చర్ చేశాడు. ఆయనే ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రెహోబోత్ బీచ్ లో ప్రెసిడెంట్ అద్భుతమైన బీచ్ డే ను ఎంజాయ్ చేస్తున్నారని ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సంబంధించిన ఇలాంటి పలు ఫొటోలు ఎప్పుడో బయటకు వచ్చాయి. షర్ట్ లేకుండా, కండలు తిరిగిన శరీరంతో హార్స్ రైడింగ్ చేస్తున్న పుతిన్ ఫొటో ఇప్పటికీ ఒక సెన్సేషనే. ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. తాను అందరి కంటే బలవంతుడిని అని చెప్పేలా… హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలిన్ బాడీకి తన తలను జోడించిన ఫొటోను గతంలో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.