తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు : కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదని తీర్పు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ 2018లో హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వనమాకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. జలగం వెంకట్రావు బిఆర్ఎస్ నుండి బరిలోకి దిగారు. ఇక ఇప్పడు ఆయనే ఎమ్మెల్యే అయ్యారు.