వివేకా హత్య కేసు.. వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు

తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన కోర్టు

ys-viveka-murder-case

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.