ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతిః ఏపిలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ సీఈవోగా ఎం. గౌతమిని నియమించారు. భూపరిపాలన శాఖ అదనపు చీఫ్ కమిషనర్‌గా ఉన్న ఇంతియాజ్‌కు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రసుత్తం అమూల్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న బాబును ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా నియమించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/