బిజెపి ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసిన బిజెపి ఎంపీ పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ ను ఆశ్రయించారు కేసీఆర్ కుమార్తె ..ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 9వ చీఫ్‌ జడ్జ్‌ ముందు ఇంజక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలతో ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రజల్లో తనకు ఉన్న మంచి పేరును, ప్రతిష్టను చెడగొట్టడానికి అక్రమ పద్ధతులను వారు ఎంచుకున్నారన్నారు. వారు చేసిన ప్రకటనల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదన్నారు. తనకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఎమ్మెల్సీ కవిత కోరారు.