ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కేసీఆర్ శుభవార్త ..

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ స్కూల్స్ లలో చదివే విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యాశాఖ వాటిని… స్కూల్ బ్యాగ్ లో ఉంచి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి పథకం పేరు పెట్టి ఇవ్వొచ్చా ? అందుకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మరిన్ని నిధులను పొందే అవకాశం ఉందా ? అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మందికి స్కూల్ బ్యాగులు ఇవ్వాలంటే ఏకంగా 40 కోట్లు ఖర్చు అవుతుంది. జత బూట్లు అలాగే రెండు జతల సాక్సులు కూడా ఇస్తే ఎంత అవుతుంది ? అనే దానిపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.