గవర్నర్‌ వ్యాఖ్యలపై కెసిఆర్‌ స్పందించాలి

ఇప్పటికైనా తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకోవాలి

Krishna Saagar Rao

హైదరాబాద్‌: కరోనా నియంత్రణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు టిఆర్‌ఎస్‌ పై మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలతో ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. తమిళిసై స్వయంగా డాక్టర్ అని… దీంతో, ఆమె తొలి నుంచి కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నారని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆమె బహిరంగ విమర్శలు చేశారని తెలిపారు. గవర్నర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పందించాలని డిమాండ్ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/