రామారావు ఆన్ డ్యూటీ మూవీ పబ్లిక్ టాక్

మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. రవితేజ నటించిన గత చిత్రం ఖిలాడీ పెద్దగా విజయం సాదించకపోయేసరికి ఈ మూవీ ఫై ప్రేక్షకులు , అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందని చెపుతున్నారు.

సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ మాస్ డైలాగ్స్‌లో మాస్ మాహారాజా అదరగొట్టాడని , చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని … సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్‌గా ఉందంటున్నారు. శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా.. రవి తేజను సరికొత్తగా చూపించాడని.. కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయంటున్నారు.

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని.. ఫస్ట్ టూ గుడ్ అంటూ అని ఆడియన్స్ చెబుతున్నారు. సెకండాఫ్‌లో మలుపులు, ట్విిస్టులతో స్క్రీన్‌ ప్లే మెస్మరైజ్ చేస్తుందని.. క్లైమాక్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు. అయితే, కామెడీ లేకపోవడం, థ్రిల్ మిస్ అవడం, లాజిక్ లేని సీన్లు, పాటల టైమింగ్ మిస్ అవడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని అంటున్నారు.