నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్ ..

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరోసారి తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. వివిధ శాఖల్లో మరో 10 వేల 105 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి.

మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా మ‌రో 995 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ల‌భించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ శాఖ‌ల్లో ఉన్న‌ 45,325 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని స్పష్టం చేశారు.