ఏపీలో కొత్త బార్‌ పాలసీని తీసుకొచ్చిన ఏపీ సర్కార్

ap-cm-jagan

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకొచ్చింది. రాష్ట్రంలో కొత్త బార్‌ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొత్త పాలసీ ప్రకారం బార్లకు లైసెన్స్‌ మూడు సంవత్సరాల పాటు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త బార్‌ పాలసీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, జిల్లాలు పెరిగిన బార్ల సంఖ్య పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

కాగా, 840 బార్ల లైసెన్స్‌లు మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈలోగా బార్ల లైసెన్స్‌లు పొందేందుకు వేలం, లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది. 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 5 లక్షల డిపాజిట్‌, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.7 లక్షల 50 వేలు, 5 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 లక్షలు అప్లికేషన్‌ ఫీజుగా నిర్ణయించారు. వేలం పద్దతిలో షాపుల కేటాయింపు ఉంటుంది. త్రీ స్టార్ హోటల్‌లో లైసెన్స్‌ ఫీజు రూ. 5 లక్షలు గా తెలిపింది.