అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప రేపు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ ..రేపటి నుంచి ఈనెల 30 వరకు ఈ చిత్రం ఐదో ఆట ప్రదర్శనకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు అదనపు షోకు అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

తెలంగాణలో పుష్ప కు తొలి వీకెండ్ అదిరిపోయే బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధ్యమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లు మల్టీప్లెక్స్ లు టికెట్ ధరలను పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. హైదరాబాద్ లో కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. అదంతా పుష్పకు అనుకూలంగా జరుగుతోంది.

పక్కా మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా ‘పుష్ప’ను తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శేషాచలం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు చిత్రంపై అంచనాల్ని తెగ పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేసింది.