అసోంలో ఆకస్మిక వరదలు

బాధితులకు సహాయక చర్యల్లో అధికారగణం

floods in Assam
floods in Assam

అసోంలో అనేక చోట్ల ఆకస్మిక వరదలు ..కొండచరియలు విరిగిపడటం జరిగింది. దిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. డిమా హసావోలోని హఫ్లాంగ్ రెవెన్యూ ప్రాంతంలో మహిళ సహా ముగ్గురు వ్యక్తులుమృతి చెందారు. వరద భీభత్సకారణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రైలు.. రహదారి మార్గాలను నిలిపివేశారు..అసోంలోని ఐదు జిల్లాల్లో సుమారు 25,000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. కర్బీ అంగ్లాంగ్ వెస్ట్‌లో సుమారు 2 వేల మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి వరదల బారిన పడ్డారు. రెండు జిల్లాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 10 సహాయ శిబిరాలు .. పంపిణీ కేంద్రాలలో కనీసం 227 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/