రెబల్ స్టార్‌తో మెగాస్టార్.. ఇండియన్ బాక్సాఫీస్‌కు చుక్కలే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ప్రభాస్, ఆదిపురుష్, సలార్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కి్స్తున్న సలార్ చిత్ర షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ప్రభాస్, ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో అదిరిపోయే సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమా కథ పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌కు గాడ్ ఫాదర్‌గా ఓ స్టార్ యాక్టర్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ గాడ్ ఫాదర్ రోల్‌లో మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు కావడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఒకే స్క్రీన్‌పై అటు రెబల్ స్టార్, మెగాస్టార్‌లను చూస్తే ఆ కిక్కు ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ప్రభాస్ సినిమాలో చిరంజీవి నటిస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.