ట్రంప్ కుమారుడు బారన్‌కు కరోనా

వెల్లడించిన మెలానియా ట్రంప్

President Trump’s son Barron had coronavirus

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియాల కుమారుడు బారన్ ట్రంప్ (14)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని బుధవారం నాడు వెల్లడించిన మెలానియా, బారన్ లో వైరస్ లక్షణాలు లేవని, అయితే, తాజాగా నమూనాలను పరీక్షించగా, కరోనా సోకినట్టు తేలిందని అన్నారు. ప్రస్తుతం బారన్ కు చికిత్స జరుగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ట్రంప్, మెలానియాలకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై ట్రంప్ మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనూ చేరాల్సి వచ్చింది. ట్రంప్ కోలుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, మెలానియా ఇంకా క్వారంటైన్ లో ఉన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/