సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చేసిన రావణాసుర

మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర అప్పుడే ఓటిటి లో వచ్చేసింది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజ రావణాసుర తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి ఆట తోనే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ప్రభావం కలెక్షన్ల ఫై భారీగా పడింది. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 11.95 కోట్లు క్లోజింగ్ కలెక్షన్స్ తో ముగిసింది. మరో 11 కోట్ల వరకు సినిమాకి నష్టం వచ్చింది.

ఇదిలా ఉంటె ఈ చిత్ర ఓటిటి రైట్స్ దక్కించుకున్న అమెజాన్‌ ప్రైమ్‌లో ఎలాంటి ప్రచారం లేకుండా డైరెక్ట్ గా గత అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ లో పెట్టేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ లోకి రావడం తో అభిమానులు షాక్ లో పడ్డారు. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు న‌టించారు. అక్కినేని సుశాంత్‌ కీలకపాత్ర పోషించాడు. మరి థియేటర్స్ లలో సందడి చేయలేకపోయినా రావణాసుర..ఓటిటి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.