పండుగల కంటే ప్రజల ప్రాణాలు ఇంకా ముఖ్యం

టపాసుల నిషేధంలో తాము జోక్యం చేసుకోబోము..సుప్రీం

supreme court
supreme court

న్యూఢిల్లీ: పండగ నేపథ్యంలో బాణసంచాను కాల్చ‌డంపై నిషేధం విధించ‌డాన్ని స‌వాల్‌చూస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జురుపుకోవ‌డం ముఖ్యమే కానీ, పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ఇంకా ముఖ్య‌మ‌ని పేర్కొన్న‌ది. పండుగ‌ల ఎంత ప్రాముఖ్య‌త క‌లిగిన‌వో మ‌న అంద‌రికీ తెలుస‌ని, అయితే ప్ర‌స్తుతం మ‌నం క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్నామ‌ని, ఇలాంటి స‌మ‌యంలో ప‌రిస్థితిని మెరుగుప‌ర్చ‌డానికి తీసుకునే నిర్ణ‌యాల‌కు క‌లిసిక‌ట్టుగా మ‌ద్ద‌తు నిలువాల‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ సూచించారు.
‘పండుగ‌లు చాలా ముఖ్యం అనే సంగ‌తి మాకు తెలుసు. కానీ ప్ర‌జ‌ల ప్రాణాలు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు వారిని కాపాడుకోవ‌డం కోసం ఏదో ఒక ప్ర‌య‌త్నం త‌ప్ప‌క జ‌రుగుతుండాలి. అలాంటి ప్రయ‌త్నాల‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి’ అని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేర్కొన్నారు. ప‌శ్చిమబెంగాల్‌లో క్రాక‌ర్స్‌పై అక్క‌డి ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ ఉద‌యం ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. పిటిష‌న్‌ను తోసిపుచ్చుతూ పై వ్యాఖ్య‌లు చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/