ట్రంప్ ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ ఖాతాలు బ్లాక్

వాషింగ్ట‌న్ డిసిలో 15 రోజులు క‌ర్ఫ్యూ

Trump Twitter and Facebook accounts blocked
Trump Twitter and Facebook accounts blocked

Washington: 4000 ఏళ్ల అమెరికా ప్ర‌జాస్వామ్య చరిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ట్రంప్ మ‌ద్ద‌తుదారులు అమెరికా ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మావేశ‌మైన‌ క్యాపిటల్‌ బిల్డింగ్ పై దాడికి తెగ‌బ‌డ్డారు..

విధ్వంసం సృష్టించారు. అల్ల‌రుమూక‌ల‌ను అడ్డుకునేందుకు భ‌ద్ర‌తా సిబ్బంది జ‌రిపిన కాల్పుల‌లో న‌లుగురు మృతి చెందారు.. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు.. కాగా పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు తెలిపారు.

క్యాపిటల్‌ భవనంలో కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్‌ డీసీలో మేయర్‌ మురియెల్‌ బౌజర్‌ కర్ఫ్యూ విధించారు. అత్యవరసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్ఫ్యూ 15 రోజుల పాటు కొనసాగనుందని కూడా పేర్కొన్నారు.

కాగా అల్ల‌రిమూక‌ల‌ను త‌రిమివేసిన అనంత‌రం జ‌రిపిన సోదాల‌లో పెద్ద ఎత్తున మార‌ణాయధాల‌తో పాటు పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

క్యాపిట‌ల్ భ‌వ‌నాన్ని పేల్చివేసేందుకు ట్రంప్ మ‌ద్ద‌తుదారులు కుట్ర ప‌న్నార‌ని పోలీసులు అంటున్నారు..

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/