చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

TS Minister Sabita indra Reddy
TS Minister Sabita indra Reddy

Vikarabad: వికారాబాద్ నియోజకవర్గంలోని దారూర్ మండలం డోర్నల గ్రామం మెథడిస్టు చర్చి సమీపంలో రూ 2కోట్ల 30 లక్షల 50 వేల నిధులతో నిర్మించనున్న చెక్ డాం నిర్మాణ పనుల కు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డిలు పాల్గొని శంకుస్థాపన చేశారు.

ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ”భూగర్భ జలాల పెంపుకు ఈ చెక్ డ్యామ్ లు దోహద పడుతాయని తెలిపారు. 

వర్షపు నీరు వృధా కాకుండా తెలంగాణ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు

లాక్ డౌన్ తో రోజు వారీ పనులు చేసుకునే వారితో పాటు చాలా మందికి వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా సడలింపు ఇవ్వటంజరిగిందన్నారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/