వలసలపై ట్రంప్‌ సంచలన నిర్ణయం

ఇమ్మిగ్రేషన్‌కు చెక్ పెట్టే ఉత్తర్వులపై నేడు సంతకం

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. తమ దేశంలోకి వలసల్ని( ఇమ్మిగ్రేషన్‌) తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ నేడు సంతకం చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఓ అదృశ్య శక్తి (కరోనా) కారణంగా దేశ పౌరుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని, వారి ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఏర్పడిందని ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఉత్తర్వులపై నేడు సంతకం చేయబోతున్నట్టు కూడా పేర్కొన్నారు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారత్, చైనా దేశస్థులే అత్యధికం. ఇప్పుడీ నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై అమెరికా గడ్డపై అడుగుపెట్టడం కష్టమే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/