వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ అనుమానమే!!

జపాన్‌లో కరోనా విజృంభణ అధికమవడం కారణం

tokyo olympics
tokyo olympics

టోక్యో: కరోనా కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయించారు. కాని వచ్చే ఏడారి కూడా ఒలింపిక్స్‌ నిర్వహణ సాధ్యమయ్యెలా కనిపించటంలేదు. ఇందుకు కారణం ఈ సారి ఒలింపిక్స్‌ కు ఆతిథ్యమిస్తున్న జపాన్‌లో కరోనా తీవ్రత అధికమవుతుండడం. జపాన్‌లో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడంతో వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ జరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేమని క్రీడల నిర్వహక కమిటి సిఈవో తొషిరో ముటో తాజాగా వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/