ఏపి హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు

andrapradesh high court
andrapradesh high court

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపికి కేటాయించిన వారిలో బొప్పూడి కృష్టమోహన్‌, కె. సురేష్‌ రెడ్డి, కె. లలితా కుమారి ఉన్నారు. కాగా వీరిని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ ఏ బోబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతితో కూడిన కొలిజియం సిఫార్సు చేసింది.
గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణమోహన్‌ పదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా, అలాగే ఏపి విభజన తరువాత ఏపి హైకోర్టులో కేంద్రం తరపున సహయ సోలిసిటర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.
లలితా కుమారి కూడా గుంటూరుకు చెందిన వారే. వీరు ప్రస్తుతం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు.
సురేష్‌ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన హైకోర్టులో క్రిమినల్‌, సివిల్‌, రాజ్యాంగానికి సంబందించిన కేసుల్లో మంచి పట్టున్న వ్యక్తి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/