యూరప్‌లో తొలి కొవిడ్‌-19 మరణం

Kovid-19
Kovid-19

ఇటలీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చైనాతో పాటు పలు దేశాలో కూడా ఈవైరస్‌తో మరణిస్తున్నారు. తాజాగా కోవిడ్‌-19 తో యూరప్‌లో తొలి మరణం సంభవించింది. కరోనా వైరస్‌ పాజిటీవ్‌ ఉన్న 78 ఏళ్ల వఅద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటలీలో మఅతి చెందాడు. వెనోటో ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఇటుకల తయారీదారు అడ్రియానో ట్రెవిసాన్‌ అనే వఅద్ధుడు కరోనాతో మఅత్యువాతపడ్డాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరోవ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు చైనాలో ఈ వైరస్‌తో 2,360 మందికి పైగా మఅతి చెందారు. 78 వేల మందికిపైగా కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. మరోవైపు చైనాలోని జైళ్లను సైతం వదలడం లేదు కరోనా. ఇప్పటి వరకు 500 మందికి పైగా ఖైదీలకు ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/