జనవరి 1 నుంచి పెన్షన్‌ మొత్తాన్ని రూ.2,500కు పెంచుతూ జగన్ నిర్ణయం

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. జనవరి 1 నుంచి పెన్షన్‌లను రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పెన్షన్‌ దారులకు రూ.2,250 అందిస్తోంది.

ఇప్పుడు మరో రూ. 250 లను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 21న సంపూర్ణ గృహ హక్కు పథకం.. జనవరి 1 నుంచి రూ.2500 పెంచిన పెన్షన్ కానుక.. జనవరి 29న ఈబీసీ నేస్తం అందిస్తారు. జనవరిలో రైతు భరోసా కూడా అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక కాకుండా మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేయాలని నిర్ణయించారు.