నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఈరోజు మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది.

రాష్ట్రంలో మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యవర్గం తమ ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే చంద్రభాను రా కదలిరా అంటూ ప్రజల్లోకి వెళ్తుండగా..లోకేష్ కూడా శంఖారావం పూరిస్తూ వస్తున్నాడు. ఇక జనసేన అధినేత కూడా రంగంలోకి దిగబోతున్నాడు. ఈరోజు ఇరు పార్టీల అధినేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. బిజెపి పొత్తు ఫై ఓ నిర్ణయం తీసుకోవాలని వెళ్తున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా తో వీరు భేటీ కానున్నారు.

లోకేష్ శంఖారావం వివరాలు… హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (జీటీఎం లేఅవుట్, లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర)

గురువారం ఉదయం 10.00 గంటలకు హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.

10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.

10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.

10.32 – హిందూపూర్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆకుల ఉమేష్ ప్రసంగం.

10.34– హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నందమూరి బాలకృష్ణ ప్రసంగం.

10.36– హిందూపూర్ నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.

10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.

11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.

11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.

11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.

12.00 – యువనేత నారా లోకేష్ మడకశిర నియోజకవర్గానికి చేరిక.

2.30 – మడకశిర నియోజకవర్గంలో భోజన విరామం.

మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం (చీపులేటి గ్రామం, మడకశిర మున్సిపాలిటీ)

మధ్యాహ్నం 2.30 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.

2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.

2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.

3.02 – మడకశిర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త టి.రంగస్వామి ప్రసంగం.

3.04 – మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఎమ్.ఈ సునీల్ కుమార్ ప్రసంగం.

3.06– మడకశిర నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.

3.26– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.

3.54– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.

3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.

3.59 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.

4.55 – యువనేత పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.

పెనుకొండ నియోజకవర్గం (తేజో కిరణ్ ఫ్యాక్టరీ, మడకశిర రోడ్, పెనుకొండ)

సాయంత్రం 5.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.

5.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.

5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.

5.32 – పెనుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఈడిగ కుమార్ ప్రసంగం.

5.34 – పెనుకొండ నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ ఎస్.సవిత ప్రసంగం.

5.36 – పెనుకొండ నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.

5.56 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.

6.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.

6.28 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.

6.29 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.

6.30 – రోడ్డుమార్గం ద్వారా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రయాణం

7.15 – పుట్టపర్తి నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ రాత్రి బస చేస్తారు.