కమలా హారిస్ కు పోటీగా నిక్కీ హేలీ!

ఇక 2024లో ఇద్దరు భారత మూలాలున్న మహిళల మధ్య అధ్యక్ష పోరు

trump-nominates-nikky-helly-for-vice-president-post

వాషింగ్టన్‌: అమెరికాలో మరో నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికలకు సౌత్ కరోలినా మాజీ గవర్నర్, యునైటెడ్ నేషన్స్ మాజీ ప్రతినిధి నిక్కీ హేలీని ప్రమోట్ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. డెమోక్రాట్లు ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఎంపిక చేసి, ఆమెనే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ తరఫున నిలపాలని భావిస్తున్న వేళ, భారత సంతతి మూలాలున్న, నిక్కీ హేలీ అయితే గట్టి పోటీ ఉంటుందని, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని రిపబ్లికన్లు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో 2024లో అమెరికా అధ్యక్ష పదవికి ఇద్దరు భారత మూలాలున్న మహిళలు పోటీ పడేందుకు ఇప్పుడే అడుగులు పడ్డట్లయింది.

కాగా, ఇండియాలోని సిక్కుల మూలాలున్న నిక్కీ హేలీ, గతంలో సౌత్ కరోలినా గవర్నర్ గానూ పనిచేశారు. రెండు రోజుల క్రితం జరిగిన నేషనల్ కన్వెన్షన్ లో ఆమె ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ కూడ ఆమెను మెచ్చుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/