నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

TS Cabinet approval for key decisions
TS CM Kcr

హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష సమావేశం సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో జరగనుంది. కేంద్రంపై పోరు కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటన చేయనున్నారు . ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అలాగే కార్పొరేషన్‌ చైర్మన్లకు కూడా ఆహ్వానం పంపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/