నేడు, రేపు కోస్తా, రాయలసీమలో వర్షాలు

నేడు తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం
ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా రూపాంతరం

Today, tomorrow it will rain on the coast, Rayalaseema

అమరావతి: నేడు, రేపు ఏపీలోని కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న వాయుగుండంగా మారింది.

ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంట కదిలే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నానికి ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/