‘పెన్నీ’ సాంగ్ లో అదరగొట్టిన మహేష్.. సితార

‘సర్కారు వారి పాట’ సెకండ్ సింగిల్ విడుదల

YouTube video
Sarkaru Vaari Paata’s Second Single Penny Featuring Superstar Mahesh Babu, Sitara Released

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట‘. పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో మే 12న సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ చిత్రాల సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ నుంచి ఆదివారం సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.
పెన్నీ.. అంటూ సాగే లిరికల్ వీడియో విశేషం ఏంటంటే ఇందులో తొలిసారి మహేష్ ముద్దుల కూతురు సితార కనిపించింది.
ఇన్ స్టా రీల్స్ లో మహేష్ పాటలకు అదిరిపోయే స్టెప్పులేస్తూ సందడి చేసిన సితార తొలిసారి ఈ పాటలో మహేష్ తో కలిసి కనిపించింది. ఈ పాట ప్రారంభంలో అదిరిపోయే స్టెప్పులేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియోని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/