బాలాపూర్‌ వినాయకుడి వద్ద ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

mlc-kavitha-visits-balapur-ganesh

హైదరాబాద్ః టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నగరంలోని బాలాపూర్‌ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత గణేశ్‌ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం నిర్వాహకులు కవితకు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆమెతోపాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కార్తిక్‌రెడ్డి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బాలాపూర్‌ గణేశుడిని తొలిసారిగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వినాయక ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డూపై ఉత్సాహం ఉంటుందని చెప్పారు. కమిటీగా ఏర్పడి గ్రామస్తులు ఎంతో వైభవంగా ఉత్సవం నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు రాకూడదని భగవంతుడిని కోరుకున్నానని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/