పబ్లిసిటీ కోసం ప్రశాంత్ కిశోర్ ఏమైనా చేస్తాడుః నితీశ్ కుమార్

బిజెపి కోసం ఆయన రహస్యంగా పని చేస్తున్నాడు..బీహార్ సిఎం

Nitish Kumar
Nitish Kumar

పాట్నాః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిశోర్ కు పబ్లిసిటీ ఎలా పొందాలో తెలుసని… పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు. బీహార్ లో ఆయన చేయాలనుకున్నది చేయనివ్వండని అన్నారు. 2005 నుంచి బీహార్ లో ఏం జరిగిందో ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించిన నితీశ్ కుమార్… ఆయనకు కేవలం పబ్లిసిటీ ఎలా పొందాలి, స్టేట్ మెంట్లు ఎలా ఇవ్వాలి అనేది మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. బిజెపికోసం ప్రశాంత్ కిశోర్ రహస్యంగా పని చేస్తున్నారని అన్నారు. బిజెపితో ఉండాలని ఆయన మనసులో ఉన్నట్టుందని చెప్పారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నితీశ్ కుమార్ పైవ్యాఖ్యలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/