ఈటల రాజేందర్ తో సినీ నటి దివ్యవాణి భేటీ

బిజెపిలో చేరాలని ఈటల ఆహ్వానించినట్టు సమాచారం

Actress Divyavani Met with Etela Rajender

హైదరాబాద్ః సినీనటి దివ్యవాణి ఇటీవలే టిడిపికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే దివ్యవాణి బిజెపిఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. వీరి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దివ్యవాణిని బిజెపిలోకి ఈటల ఆహ్వానించినట్టు సమాచారం. బిజెపిలో చేరేందుకు ఆమె కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కాగా, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బిజెపి… ఏపీలో సైతం తన బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడమే కాకుండా… సినీ గ్లామర్ ను కూడా వాడుకోవాలనుకుంటోంది. ఇప్పటికే విజయశాంతి, జయప్రద, జీవిత తదితర యాక్టర్లు బిజెపిలో ఉన్నారు. జయసుధ కూడా బిజెపిలో చేరబోతోందనే ప్రచారం జరుగుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/