కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోంది : ఆనంద్‌ మహీంద్ర

ముంబయి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి భారత్‌ పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఘన విజయంపై పారిశ్రామిక వేత్త మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో స్పందించారు. ఒక్కసారిగా ‍తనకు కలర్​ బ్లైండ్​నెస్​ ఆవరించిదంటూ హాకీ టీం విజయంపై సంతోషాన్ని ప్రకటించారు.. మనవాళ్లు గెల్చుకున్న కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోందంటూ కితాబిస్తూ ట్వీట్‌ చేశారు.

కాగా, జర్మనీతో గురువారం జరిగిన పురుషుల హాకీ పోరులో భారత్‌ అద్భుత విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. 41 ఏళ్ల తరువాత హాకీలో తొలిసారి ఒలింపిక్‌ పతకాన్ని సాధించడం విశేషం. భారత జట్టు సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువ కురుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/