భూకబ్జా పై నోరు జారొద్దు : పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు!?

శామీర్ పేటలోని ‘ఈటల’ నివాసానికి చేరుకుంటున్న అభిమానులు

TRS issued orders
TRS issued orders

Hyderabad: తెలంగాణ మంత్రి ఈటల కోసం హైదరాబాద్ కు వస్తున్న ఆయన అభిమానులపై పోలీస్ నిఘా ఉంచారని తెలిసింది. అయితే తనను కలిసేందుకు ఎవ్వరూ రావొద్దని ఈటల కోరారు. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ అధిష్టానం నేతలకు కీలక ఆదేశాలు చేసినట్లు తెలిసింది. మంత్రి ఈటల రాజేందర్ వివాదంపై ఎవరూ మాట్లాడ వద్దని జిల్లా ఎమ్మెల్యేలకు ఆదేశించినట్లు సమాచారం . కాగా, ఈటల వ్యవహారంపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ నేతలు ఖండించారు. ఈటల కష్టపడి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారని, ఈటలపై ఆరోపణలను మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శామీర్‌పేటలోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/